Thursday, February 27, 2014

మా ఊరు మరియు మాట మంతి



మా...గ్రామం:        గొల్లపాలెం
మా మండలం:   మలికిపురం
మా జిల్లా:      తూర్పుగోదావరి
మా రాష్ట్రం:     ఆంద్రప్రదేశ్‌.

మా... ఊరు అందరు ఊర్ల లాగానే చాలా భాగుంటుంది. ఒక ప్రక్క భారతదేశానికే సరిహద్దు అయిన బంగాళాఖాతం మీరు పుస్తకాలలో చదివే వుంటారు, ఆబంగాళాఖాతమే... ఆ సముద్ర తీరానిగురించి చెప్పుకొంటుపోతే ....ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి మీరే చదవండి....ఆ సముద్రతీర ప్రవాహానికి వచ్చిన ఇసుకు తెన్నెలు చూడటానికి చాలా బాగుంటాయి. చల్లటి గాలీ ఆహ్లాదకరమైన వాతావర్ణం చాలా భాగుంటుంది. గాలి విసరి ఇసుకరేణువులు పరుగెడుతుంటే ఆరేణువులు కాలికి తగులి చక్కిలి గింతలు పెడుతుంటాయి. మరో ప్రక్క సముద్రము అలలతో హోరెత్తిస్తుంటుంది, అలలు కాలిక్రిందకు వస్తుంటే వాటినుండి తప్పించుకొని వెనుకకు పరుగెడుతుంటే భలే సరదాగా ఉంటుంది.అక్కడే రకరకాల ఆలుచిప్పలు, రకరకాల గవ్వలు వాటిని చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంటుంది.ఇంతేనా... వర్షాకాలంలో ఎర్రని పీతలు వేలకొలది సముద్రతీరమంతా ఎర్రని గులాబిలు మనకోసమే చల్లినట్లుగా కనిపిస్తాయి. సముద్రంలో కంటికి కనిపించే ఆఖరి చోట ఆకాశము సముద్రములో కలిసిపోయిందా అనిపిస్తుంది ఆచివరి కొనలలో చూస్తే తెరచాప చాచిన పడవలు మరబోట్లు ఒకదాని వెనుక మరొకటి వరుసలో కనిపిస్తాయి. మరి సముద్రములో స్నానం చేయాలనిపిస్తే ఎంతసేపయినా ఇంకా చేయాలనిపిస్తాది;అందరితో కలిసి చేయాలనిపిస్తే మా సముద్రతీరాన సాగర సంగమ కడలిలో చల్లంగితీర్థం రోజున ఆనేకమంది వచ్చి స్నానం చేస్తారు అప్పుడు అందరు భలే ఆనందిస్తారు. ఇక్కడితో అయిపోయిందా..? సముద్రతీరమందలి ఈకొన నుండి కంటికి కనిపించే ఆకొనవరకు లక్షల సంక్యలో సరుగుడు తోటలు కొబ్బరి తోటలు పచ్చగా వంపులు తిరిగిన సముద్రతీరంలో కనిపిస్తాయి. ఇన్ని రకాలయిన అనుభవాలు ఒక్క సముద్రతీరంలోనే చూడొచ్చు. ఇన్ని రకాలయి రుచులను ఆహ్లాదకరమైన ప్రదేశమును  తీరప్రాంతవాసులకు దేవుడే ఇచ్చాడు. ఇక్కడ భాధకరమైన విషయాన్నికూడా చూడొచ్చు. అదేమంటే ....కొంతమంది భడా దొంగలు ఈ తీరప్రాంతంలో  దేవుడు ఇచ్చిన భూ ధనాగారాన్ని కొల్లగొడుతున్నారు భూగర్బంలోని ఆయిలు నిల్వలను దోచుకొంటున్నారు. ఇందుకు భాద కలుగుతోంది.  మరో ప్రక్క చిన్న చిన్న కాలువలు కాలువల వంచన వాలివున్న కొబ్బరిచెట్లు, కాలువలలోని నీటి ప్రవాహం పరుగులుతీస్తు, పరుగులు తీస్తు గోదావరి ఒడిలోకి వెళ్ళుతుంటే  ఆప్రవాహాన్ని చూస్తుంటే ఒక ప్రక్క భయం వేస్తున్నా.. మరో ప్రక్క మనసులో ఆ చిన్న చిన్న అలలకు భలే సరదాగా ఉంటుంది సుమీ...

……………..ఉదయాన్నే లేవగానే పక్షులు కిల కిల రావాలు చేస్తు దేవున్ని స్మరిస్తుంటే ఆ చిన్న శబ్ధానికి నిద్రలేచి హమ్మయ్య తెల్లవారింది అంటూ పచ్చని చెట్లువైపు మొకాన్ని త్రిప్పి చూసే  మా ఊరిలో పచ్చదనం కరువైనదని చెప్పక తప్పట్లేదుఏం చెప్పమంటారు మా ఊరంతా పచ్చగానే ఉండేది ఒకప్పుడు కొందరు ఆపచ్చదనాన్ని చూసి ఓర్వలేక  పచ్చని పొలాలు లేకుండా చేసి ఊప్పునీటితో ఊరును ఊరబెట్టిఎండగట్టారు. మరి ఎంకెక్కడి పచ్చదనం???? పచ్చనిపొలాలున్నప్పుడుఎన్నో పక్షులు,కొంగలు మరెన్నో జీవరాశులతో ఊరంతా కోలాహలముగా ఉండేది. ఊరు చిన్నది అయినా అందులో పొలాలు తక్కువైనా ఆపచ్చదనం తో ఊరికే కళవచ్చేది. వరిచేలు కోయగానే వందలకొలది కొంగలు,పక్షులు చేలలోకొచ్చేవి వాటిని చూస్తే నిజంగా ఆనదంగా ఉండేది. కోతలు కోసేసిన తరువాత కొంతమంది పిల్లలు సరదాగా పరిగి ఏరుకొనేవారు కానీ ఇలా సరదాపడటానికి ఈ తరం వారికి ఇక సరదానే లేకుండా చేసింది కాలం. మనిషి డబ్బువ్యామోహంలో పడి పచ్చని ప్రకృతిని తనచేతులతో నాశనం చేస్తున్నానని గ్రహించలేకపోతున్నాడు ముందుతరాల వాళ్ళకు వ్యవసాయం అంటే ఏమిటో తెలియని రోజులొస్తాయేమో అనిపిస్తుంది. కొందరి వ్యక్తుల అసబ్యకరమైన వాదనల వలనమాటల వలన,ప్రవర్తన వలన,అలాగే కొందరి స్వార్థం వలన  ఈ రోజు ఊరులలోని మనుష్యులకు అన్నీకరువైతున్నాయి. చేతిలో చిల్లర దబ్బులు ఊన్నా...! చేపపిల్లను కొనుక్కు తినటానికి చేపలు దొరకని పరిస్థితిపోనీ నాలుగు కూరగాయమొక్కలు పెరట్లో పెంచుకొందామంటే ఊరంతా ఉప్పునీరైపోయే....! ఇంక మొక్కలు ఏలా పెంచేది చచ్చినోడికి వచ్చింది కట్నం అనీ..... ఉంటే తినడం లేకపోతే లేదన్నట్టే ఉంది గ్రామలలోని సామా.న్యుడి సంగతి.   ఉన్నవాడు ఇంకా ఉన్నోడవుతున్నాడు లేనివాడు ఇంకా దిగజారిపోతున్నాడు.  మనిషి స్వార్థపరుడుగా ఉండటం వలనే పేదవాడు ఒకప్పుడూన్నాడు అలాగే  ఇప్పుడు ఉన్నాడు. పేదరికం పేదవాడికి ఒక వ్యాదిలా మారిందని స్వార్థం వదలి నిజాయితీగా ప్రతీ ఒక్కరు ఉంటేనే పేద అనేవాడు లేనప్పుడే ఊరుకూడా పచ్చగా ఉంటుందని ఊరు ఎప్పుడు పచ్చగా ఉంటే దేశం బాగుంటుందని మనిషి ముందుగా తెలుసుకోవాలనీ అందరి ఆశ.


వంటగ్యాస్ మళ్లీ పాత పద్ధతిలో వంటగ్యాస్‌కు ఆధార్ కట్!


వారం తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం!  హైదరాబాద్: వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆధార్ రహిత సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల జారీకి ఎట్టకేలకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ)ని తాత్కాలికంగా నిలిపివేసిన ప్రభుత్వం ఆధార్‌తో నిమిత్తం లేకుండా పాత విధానంలోనే వినియోగదారులకు సబ్సిడీ సిలిండర్లు అందించాలంటూ తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకుడీలర్లకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసింది. అయితే వినియోగదారులకు పాత విధానం అమల్లోకి రావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. డీబీటీ తర్వాత డీలర్లంతా కొత్త సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో మళ్లీ పాత పద్ధతిలో సాఫ్ట్‌వేర్ రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందనిఇదే విషయాన్ని పెట్రోలియం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు సాక్షికి చెప్పారు. పాత విధానం అమల్లోకి వస్తే వినియోగదారులు కేవలం సబ్సిడీ ధర (సుమారు రూ.440) మాత్రమే చెల్లించి సిలిండర్ తీసుకోవచ్చు. ఆధార్ నమోదుబ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధానంసబ్సిడీ మొత్తం బ్యాంకులో జమ కాకపోవడం లాంటి తలనొప్పులు ఇక ఉండవు. ప్రతి వినియోగదారుడు ఏడాదికి 12 సిలిండర్లు ఇలా సబ్సిడీ మొత్తాన్ని చెల్లించి తీసుకోవచ్చు.

ప్రజలు త్రాగడానికి నీరులేకుండా డబ్బుకు లోకం దాసోహం
డబ్బుకు లోకం దాసోహం అనిఒకప్పుడు ఈ పైపులైన్‌ లు లేనప్పుడు జనం చక్కగా నూతిలొ నీళ్ళు తాగేవారు. అప్పుడు ఈ ఇక్కట్లు లేవు. కానీ ఏ దరిద్రుడో ఈ విధంగా తయారుచేయించాడు. ఆ చెరువులైనా సక్రమంగా తవ్వారా అంటే అదీలేదు. ఆత్మహత్యలకు మాత్రం పనికొస్తున్నాయి. నిండుగా నీళ్ళుండే వర్షాకాలం ఎవరూ పట్టించుకోరు. వేసవిలో మాత్రం గొంతుతడుపుకోవడానికి నీటిని కొనుక్కోవాలాబైర్రాజు ఫౌండేషన్‌ కి నీటిసరఫరా ఆపరు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారానికి దెబ్బసుమా! అధికారులకు ఉద్యోగాలే ఊడిపోవూప్రజలేమైనా దేవుళ్ళా ఏమిటి? 
ప్రజల భాధలు ప్రజలే తీర్చుకోవాలి. ప్రజాసేవకులుఅధికారులు మాత్రం వ్యపారుల మొ........ డుస్తారు!
ప్రజలు ఉప్పునీటి చెరువులుని నమ్ముకుని త్రాగడానికి నీరులేకుండా చేసుకున్నారు, .ఉప్పునీటి చెరువులు వలన భూగర్బజలాలన్నీఉప్పుగా మారిపోయాయి,చెరువుల్లో వాడే రసాయనాలవలన చర్మవ్యాదులు వస్తున్నాయి..పరిసరాలు కాలుష్యం అయిపోయి అంటువ్యాదులు వస్తున్నాయి. అయినా చెరువులపై మోజు తగ్గలేదు.. ఇంకా ముందుంది ముసళ్ళ పండగ అన్నా...
ఖచ్చితంగా అదె చెప్తున్నా! కొంతమంది స్వార్ధపరులవల్లఇన్నివేలమంది అమాయకులు బలౌతున్నారు! అడుక్కుతినేవాడు కూడా వాటర్‌ బాటిల్‌ కొనుక్కొని తిరగాలి. ఇంతదారుణమైన పరిస్తితి దాపురించడానికి కారణమైన వారికి అనుభవించలేనంత దారుణమైన శిక్షలుంటాయ్‌!
పొల్యూషన్ కంట్రోల్ చట్టం ప్రకారం సముద్రతీరప్రాంతంలో 5కిలోమీటర్ల వరకు ఆక్వాకల్చర్ చెరువులు సాగుకు అనుమతిలేదు. ఎవరైనా దీనిని దీక్కరిస్తే అమలాపురం ఆర్డిఓస్తానిక ఎమ్మార్వో గారికి,గ్రీవెన్స్ సెల్ లో పిర్యాదు చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు.

మా ఊరు అందాలు చిత్రాలు

For Zoom Click picture

























ఇంకా చాలానే ఉన్నాయ్ .......ఎదురు చూస్తూ ఉండండి, మీ ముందుకు తప్పక  తీసుకొస్తాను.

మా ఊరు మంచి మాట

మా ఊరు పండుగలు


అబ్బో.......చాలనే ఊన్నాయి ....చూద్దాం

  1. సంక్రాంతి
  2. ఉగాది
  3. దసరా
  4. శ్రీనామ నవమి 
  5. దీపావళి
  6. క్రిస్ట్ మాస్

మనసుకు నచ్చేవి

1. మనసును ప్రశాంత పరిచే సముద్రతీరము.
2. పర్వశించే గోదావరి.
3. ఒయ్యరంగా ఒంపులు తిరిగిన ఉప్పు కాలువ.
4. మా చిన్న తనంలో పెద్దవాళ్ళు ఆడే కభ్బడ్డీపోటి.
5. వసంత ఋతువులో ఊరంతా మొలిచే పచ్చని గడ్డి. 
6. వర్షాకాలంలో వర్షం శీతాకాలంలో కురిసే మంచు.

పచ్చని వాతావర్ణం

 ……………..ఉదయాన్నే లేవగానే పక్షులు కిల కిల రావాలు చేస్తు దేవున్ని స్మరిస్తుంటే ఆ చిన్న శబ్ధానికి నిద్రలేచి హమ్మయ్య తెల్లవారింది అంటూ పచ్చని చెట్లువైపు మొకాన్ని త్రిప్పి చూసే  మా ఊరిలో పచ్చదనం కరువైనదని చెప్పక తప్పట్లేదు, ఏం చెప్పమంటారు మా ఊరంతా పచ్చగానే ఉండేది ఒకప్పుడు కొందరు ఆపచ్చదనాన్ని చూసి ఓర్వలేక  పచ్చని పొలాలు లేకుండా చేసి ఊప్పునీటితో ఊరును ఊరబెట్టి, ఎండగట్టారు. మరి ఎంకెక్కడి పచ్చదనం???? పచ్చనిపొలాలున్నప్పుడు, ఎన్నో పక్షులు,కొంగలు మరెన్నో జీవరాశులతో ఊరంతా కోలాహలముగా ఉండేది. ఊరు చిన్నది అయినా అందులో పొలాలు తక్కువైనా ఆపచ్చదనం తో ఊరికే కళవచ్చేది. వరిచేలు కోయగానే వందలకొలది కొంగలు,పక్షులు చేలలోకొచ్చేవి వాటిని చూస్తే నిజంగా ఆనదంగా ఉండేది. కోతలు కోసేసిన తరువాత కొంతమంది పిల్లలు సరదాగా పరిగి ఏరుకొనేవారు కానీ ఇలా సరదాపడటానికి ఈ తరం వారికి ఇక సరదానే లేకుండా చేసింది కాలం. మనిషి డబ్బువ్యామోహంలో పడి పచ్చని ప్రకృతిని తనచేతులతో నాశనం చేస్తున్నానని గ్రహించలేకపోతున్నాడు ముందుతరాల వాళ్ళకు వ్యవసాయం అంటే ఏమిటో తెలియని రోజులొస్తాయేమో అనిపిస్తుంది. కొందరి వ్యక్తుల అసబ్యకరమైన వాదనల వలన, మాటల వలన,ప్రవర్తన వలన,అలాగే కొందరి స్వార్థం వలన  ఈ రోజు ఊరులలోని మనుష్యులకు అన్నీకరువైతున్నాయి. చేతిలో చిల్లర దబ్బులు ఊన్నా...! చేపపిల్లను కొనుక్కు తినటానికి చేపలు దొరకని పరిస్థితి, పోనీ నాలుగు కూరగాయమొక్కలు పెరట్లో పెంచుకొందామంటే ఊరంతా ఉప్పునీరైపోయే....! ఇంక మొక్కలు ఏలా పెంచేది చచ్చినోడికి వచ్చింది కట్నం అనీ..... ఉంటే తినడం లేకపోతే లేదన్నట్టే ఉంది గ్రామలలోని సామా.న్యుడి సంగతి.   ఉన్నవాడు ఇంకా ఉన్నోడవుతున్నాడు లేనివాడు ఇంకా దిగజారిపోతున్నాడు.  మనిషి స్వార్థపరుడుగా ఉండటం వలనే పేదవాడు ఒకప్పుడూన్నాడు అలాగే  ఇప్పుడు ఉన్నాడు. పేదరికం పేదవాడికి ఒక వ్యాదిలా మారిందని స్వార్థం వదలి నిజాయితీగా ప్రతీ ఒక్కరు ఉంటేనే పేద అనేవాడు లేనప్పుడే ఊరుకూడా పచ్చగా ఉంటుందని ఊరు ఎప్పుడు పచ్చగా ఉంటే దేశం బాగుంటుందని మనిషి ముందుగా తెలుసుకోవాలనీ అందరి ఆశ.

మా తూర్పుగోదావరి అందాలు

దేశంలోనే అత్యంత ఆహారధాన్యాల ఉత్పత్తి చేసే అందాలు ఒలకరించే మా తూర్పుగోదావరి