Thursday, February 27, 2014

పచ్చని వాతావర్ణం

 ……………..ఉదయాన్నే లేవగానే పక్షులు కిల కిల రావాలు చేస్తు దేవున్ని స్మరిస్తుంటే ఆ చిన్న శబ్ధానికి నిద్రలేచి హమ్మయ్య తెల్లవారింది అంటూ పచ్చని చెట్లువైపు మొకాన్ని త్రిప్పి చూసే  మా ఊరిలో పచ్చదనం కరువైనదని చెప్పక తప్పట్లేదు, ఏం చెప్పమంటారు మా ఊరంతా పచ్చగానే ఉండేది ఒకప్పుడు కొందరు ఆపచ్చదనాన్ని చూసి ఓర్వలేక  పచ్చని పొలాలు లేకుండా చేసి ఊప్పునీటితో ఊరును ఊరబెట్టి, ఎండగట్టారు. మరి ఎంకెక్కడి పచ్చదనం???? పచ్చనిపొలాలున్నప్పుడు, ఎన్నో పక్షులు,కొంగలు మరెన్నో జీవరాశులతో ఊరంతా కోలాహలముగా ఉండేది. ఊరు చిన్నది అయినా అందులో పొలాలు తక్కువైనా ఆపచ్చదనం తో ఊరికే కళవచ్చేది. వరిచేలు కోయగానే వందలకొలది కొంగలు,పక్షులు చేలలోకొచ్చేవి వాటిని చూస్తే నిజంగా ఆనదంగా ఉండేది. కోతలు కోసేసిన తరువాత కొంతమంది పిల్లలు సరదాగా పరిగి ఏరుకొనేవారు కానీ ఇలా సరదాపడటానికి ఈ తరం వారికి ఇక సరదానే లేకుండా చేసింది కాలం. మనిషి డబ్బువ్యామోహంలో పడి పచ్చని ప్రకృతిని తనచేతులతో నాశనం చేస్తున్నానని గ్రహించలేకపోతున్నాడు ముందుతరాల వాళ్ళకు వ్యవసాయం అంటే ఏమిటో తెలియని రోజులొస్తాయేమో అనిపిస్తుంది. కొందరి వ్యక్తుల అసబ్యకరమైన వాదనల వలన, మాటల వలన,ప్రవర్తన వలన,అలాగే కొందరి స్వార్థం వలన  ఈ రోజు ఊరులలోని మనుష్యులకు అన్నీకరువైతున్నాయి. చేతిలో చిల్లర దబ్బులు ఊన్నా...! చేపపిల్లను కొనుక్కు తినటానికి చేపలు దొరకని పరిస్థితి, పోనీ నాలుగు కూరగాయమొక్కలు పెరట్లో పెంచుకొందామంటే ఊరంతా ఉప్పునీరైపోయే....! ఇంక మొక్కలు ఏలా పెంచేది చచ్చినోడికి వచ్చింది కట్నం అనీ..... ఉంటే తినడం లేకపోతే లేదన్నట్టే ఉంది గ్రామలలోని సామా.న్యుడి సంగతి.   ఉన్నవాడు ఇంకా ఉన్నోడవుతున్నాడు లేనివాడు ఇంకా దిగజారిపోతున్నాడు.  మనిషి స్వార్థపరుడుగా ఉండటం వలనే పేదవాడు ఒకప్పుడూన్నాడు అలాగే  ఇప్పుడు ఉన్నాడు. పేదరికం పేదవాడికి ఒక వ్యాదిలా మారిందని స్వార్థం వదలి నిజాయితీగా ప్రతీ ఒక్కరు ఉంటేనే పేద అనేవాడు లేనప్పుడే ఊరుకూడా పచ్చగా ఉంటుందని ఊరు ఎప్పుడు పచ్చగా ఉంటే దేశం బాగుంటుందని మనిషి ముందుగా తెలుసుకోవాలనీ అందరి ఆశ.

No comments:

Post a Comment